27-11-2025 11:37:10 AM
న్యూఢిల్లీ: స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్(Skyroot Infinity Campus) ప్రారంభం అయింది. శంషాబాద్ లోని స్కైరూట్ క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) వర్చువల్ గా ప్రారంభించారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభబోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ స్కైరూట్(Private Rocket Factory Skyroot) ఇన్ఫినిటీ క్యాంపస్. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.... స్కైరూట్ బృందానికి అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో ఇది ఒక గొప్ప మైలురాయి అని మోదీ అన్నారు. భారత యువశక్తికి స్కైరూట్ గొప్ప ప్రతీకని తెలిపారు. భారత అంతరిక్ష రంగంలో భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తోందని ప్రధాని ఆకాంక్షించారు.
స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తోందన్నారు. సైకిల్ పై రాకెట్ మోసుకెళ్లే స్థితి నుంచి మన ప్రస్థానం ప్రారంభమైందని ప్రధాని గుర్తుచేశారు. వ్యవసాయం, వాతావరణం అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలని కోరారు. స్పేస్ సెక్టార్(Space sector)కో ఆపరేషన్, ఎకో సిస్టమ్ ను తీసుకువచ్చామని ప్రధాని సూచించారు. జన్ జీ అనుకున్నది సాధించేలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ఆయన వెల్లడించారు. అంతరిక్ష రంగంలో ఇస్తున్న మద్దతు వల్లే స్టార్టప్ లు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేటు రంగంలోనూ అంతరిక్ష సంస్థలు పుట్టుకొస్తున్నాయని ప్రధాని తెలిపారు. జన్ జీ ఇంజినీర్లు(Janji Engineers), జన్ జీ డిజైనర్ల అవకాశాలు అందుకోవాలని కోరారు. జన్ జీ కోడర్స్, జన్ జీ సైంటిస్టులు అవకాశాలు అందిపుచ్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.