calender_icon.png 18 January, 2026 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురక్షిత ప్రయాణానికి అధిక ప్రాధాన్యత

18-01-2026 06:27:50 PM

ఎస్సై హనుమా నాయక్

కోదాడ,(చిలుకూరు): సురక్షిత ప్రయాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్సై హనుమా నాయక్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అరైవ్, అలైవ్ లో భాగంగా ఆదివారం చిలుకూరు మండల కేంద్రంలో ఫంక్షన్ హాల్ వద్ద ప్రధాన రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పించారు.

ఎట్టి పరిస్థితుల్లో మద్యం, మత్తు పదార్దాలు తీసుకొని వాహనాలు నడపవద్దన్నారు. మీ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని, దీని వలన చట్టప్రకారం కేసులు ఎదుర్కోవడంతో పాటు కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.