18-01-2026 06:30:58 PM
జవహర్ నగర్,(విజయక్రాంతి): ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత,తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 30 వర్ధంతి సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో గల తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ నగర్ నందు జెండా ఎగురవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ అధ్యక్షుడు లింగాల సూరిబాబు, కర్రి వెంకట రమణ, స్వామి యాదవ్, శ్రీరాములు, సంజయ్, రాజు, మెడ స్వామి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.