calender_icon.png 10 May, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైపుణ్య విద్యకు అధిక ప్రాధాన్యం

21-11-2024 12:00:00 AM

ఏ దేశానికీ లేని ఓ అద్భుత వనరు మన దేశానికి ఉంది. అదే అత్యధిక యువశక్తి! యువజనాభాలో భారత్ ముందువరుసలో ఉందికూడా. యువత దేశాభివృద్ధికి వరంగా మారాలంటే డిజిటల్ యుగంతో సమానంగా, అంతర్జాతీయ స్థాయిలో విద్యాబోధనలు నిరంతరం కొనసాగాలి. అలా కాకుండా, నాటి పాత పోకడలే ఇం కా కొనసాగితే యువశక్తి సమాజానికి నిరుపయోగమై, శాపంగా మారే ప్రమాదమూ ఉంటుంది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో విద్యావ్యవస్థ పరంగా సమూల మార్పులు అవసరం. పాఠ్యాంశా ల్లో మార్పులు, ఆధునిక ప్రయోగశాలల ఏర్పాటు, కొత్త టీచర్ల నియామకాలు, నైపుణ్య శిక్షణ, పాఠశాలల విస్తరణ, ఆధునిక సదు పాయాలు వంటివన్నీ తక్షణ అవసరాలుగా ప్రభుత్వాలు గుర్తించా లి. ఇదే సమయంలో నాణ్యమైన విద్య, నైపుణ్యాల బోధనా జరగా లి. పాఠశాలల స్థాయిలోనే కంప్యూటర్ పరిజ్ఞానానికి బీజాలు నాటాలి. అన్ని స్కూళ్లు, కాలేజీల్లో వైఫై కనెక్షన్, అపరిమిత డేటా వినియోగం అందుబాటులోకి రావాలి. ఇప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానం కొరవడితే ఎంతటి డిగ్రీల చదువులైనా పనికిరాని పట్టాలే అవుతాయి. ప్రపంచ స్థాయి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలను యువభారతానికి బహుకరించాలి. 

 డా. బుర్ర మధుసూదన్ రెడ్డి, కరీంనగర్