31-01-2026 10:46:22 AM
నేటి నుండి స్వతంత్రులకు బుజ్జగింపు పనిలో నాయకులు ....
నాయకుల మాట వింటారా లేక ఎన్నికల్లో నిలబడుతారా ...?
వనపర్తి,(విజయక్రాంతి): ఎప్పుడు ఎప్పుడా అని సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న మున్సిపాలిటీ ఎన్నికలకు సంబందించి నోటిఫికేషన్ విడుదల కావడం నామినేషన్ల పర్వం సైతం ముగిసింది. అధికార, ప్రతిపక్షం పార్టీలో చాలా వార్డులో పార్టీ అభ్యర్థులకు ఫోటిగా స్వతంత్రులు నామినేషన్లు వేయడం తో వనపర్తి మున్సిపాలిటీ మొత్తం చర్చంచానీయంగా మారింది. తాము ఎప్పటి నుండో పార్టీ కి నమ్ముకుని ఇచ్చిన ప్రతి పిలుపుకు స్పందించి పార్టీ బలోపేతానికి కృషి చేశామని ఇంతలా కష్టపడ్డా ప్రజలకు సేవ చేసేందుకు గాను మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థి గా టికెట్ రాలేదని పార్టీలు గుర్తించక పోయిన మేము పడ్డ కష్టానికి ప్రజలందరూ తమ వెంట ఉన్నారని వారి మద్దత్తు తో నామినేషన్లు వేసి ఫోటి లో నిలబడి గెలుస్తామని ధీమా ను వ్యక్తం చేస్తున్నారు.
నేటి నుండి స్వతంత్రులకు బుజ్జగింపు పనిలో నాయకులు
పార్టీ అభ్యర్థి తరుపున టికెట్ రావాలని ఇప్పటికే ఆశావాహులు గట్టిగానే ప్రయత్నం చేసినప్పటికి కొన్ని చోట్ల వారి ఆశలకు కళ్లెం పడడం తో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. స్వతంత్ర అభ్యర్థులగా ఫోటి చేసే వారికీ ఇప్పటికే పలు మార్లు బుజ్జగింపులు అయినప్పటికీ ఫలితం లేకపోవడం ఒక వైపు ఎలాయినా ఫోటి నుండి తప్పిస్తేనే ఓట్లు చీలే అవకాశం తగ్గుతుందని లేకపోతే ఓట్లు చీలే అవకాశాలు మెండుగా ఉండడం తో నామినేషన్ తిరస్కరణ తేదీ వరకు స్వతంత్రులను నామినేషన్ విత్ డ్రాలు చేసుకునేలా నాయకులు ప్రణాళిక లు రచిస్తున్నట్లు సమాచారం.
నాయకుల మాట వింటారా లేక ఎన్నికల్లో నిలబడుతారా ...?
ఎన్నికల నోటిఫికేషన్ పడిన నాటి నుండి టికెట్ కోసం ఆశించిన రాని ఆశావాహులు స్వతంత్ర అభ్యర్థి గా నామినేషన్ లు వేసిన విషయం అందరికి తెలిసిందే. నాయకుల బుజ్జగింపులకు మాట వింటారా లేక ఎన్నికల్లో నిలబడుతారా అనేది చర్చనీయంగా మారింది. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం పలు వార్డు లకు చెందిన అభ్యర్థులకు పార్టీ బి ఫార్మ్స్ దక్కని సమయంలో స్వతంత్రులుగా ఫోటి చేసి విజయం సాధించిన సందర్భాలు సైతం ఉన్నాయి.