calender_icon.png 31 January, 2026 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన నామినేషన్ ల జాతర

31-01-2026 10:50:11 AM

కార్పొరేషన్ కు 615, మున్సిపాలిటీలకు 984 నామినేషన్లు...

బీ ఫారంల అనంతరం పార్టీ అభ్యర్థులు బరిలో...

స్క్రూటిని, విత్ డ్రా అనంతరం తేలనున్న అభ్యర్థులు

మంచిర్యాల, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్(Mancherial Corporation)తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీలకు నామినేషన్లు ఊపందుకున్నాయి. మొదటి రోజు 35 నామినేషన్లు, రెండవ రోజు 339 నామినేషన్లు, మూడవ రోజు 1225 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో మంచిర్యాల కార్పొరేషన్ లోని 60 డివిజన్లకు 615 నామినేషన్లు దాఖలు కాగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులకు 361, చెన్నూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులకు 225 నామినేషన్లు, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 22 వార్డులకు 241 నామినేషన్లు, లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 15 వార్డులకు 157 నామినేషన్లు  దాఖలయ్యాయి. బీ ఫారాలు సమర్పించేందుకు ఫిబ్రవరి మూడవ తేదీ వరకు సమయం ఉండటంతో ఆయా పార్టీలు బీ ఫారాలు అందజేసిన అనంతరం పార్టీ గుర్తులపై పోటీలో ఎంత మంది ఉంటారో, స్వతంత్ర అభ్యర్థులుగా ఎంత మంది బరిలో ఉంటారో తేలనుంది.

పోటాపోటీగా నామినేషన్లు...

మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీలకు అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు. ఇది వరకే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కొన్ని వార్డులలో అభ్యర్థులను ఎంపిక చేసి బీ ఫాంలు అందివ్వగా మరి కొన్ని డివిజన్లు, వార్డులకు ఇంత వరకు అభ్యర్థుల ఎంపిక చేయకపోవడంతో ఎవరికి వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. బీ ఫాం కన్ ఫాం అయినవారితో పాటు టికెట్లు ఆశించి భంగపడ్డ వారు చాలా వరకు ఇండిపెండెంటుగా పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. స్క్రూటిని అయిన తర్వాత, విత్ డ్రా పర్వం ముగిసిన అనంతరం ఏ డివిజన్ లో, ఏ వార్డులో ఎంత మంది బరిలో ఉంటారో తెలనుంది.

జిల్లాలో 1097 మంది అభ్యర్థులు 1599 నామినేషన్లు దాఖలు...

మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు నాలుగు మున్సిపాలిటీలకు 1097 మంది అభ్యర్థులు 1599 నామినేషన్లు దాఖలు చేశారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉండగా 615 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి 150 నామినేషన్ లు, బీఆర్ఎస్ నుంచి 159, బీజేపీ నుంచి 177, ఆప్ నుంచి 11, బీఎస్పీ నుంచి 10, ఏఐఎంఎం నుంచి నలుగురు, సీపీఎం నుంచి ఇద్దరు, ఇతర పార్టీల నుంచి 58 మంది, ఇండిపెండెంట్లు 44 మంది నామినేషన్ లు వేశారు.  బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డులకు 361 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో కాంగ్రెస్ నుంచి 166 నామినేషన్ లు, బీఆర్ఎస్ నుంచి 108, బీజేపీ నుంచి 36, బీఎస్పీ నుంచి 10,  సీపీఐ(ఎం) నుంచి ఎనిమిది, ఏఐఎంఎం నుంచి ముగ్గురు, ఇతర పార్టీల నుంచి ఎనిమిది, ఇండిపెండెంట్లు 22 మంది నామినేషన్లు వేశారు.  

చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు 225 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో కాంగ్రెస్ నుంచి 74 మంది అభ్యర్థులు నామినేషన్ లు, బీఆర్ఎస్ నుంచి 49, బీజేపీ నుంచి 37, ఆప్ నుంచి ఇద్దరు, బీఎస్పీ, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు, ఇతర పార్టీల నుంచి 19, ఇండిపెండెంట్లు 42 మంది నామినేషన్ లు వేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు 241 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో కాంగ్రెస్ నుంచి 87 నామినేషన్ లు, బీఆర్ఎస్ నుంచి 53, బీజేపీ నుంచి 34, బీఎస్పీ నుంచి ముగ్గురు, సీపీఎం నుంచి ఐదుగురు, ఇతర పార్టీల నుంచి 26, ఇండిపెండెంట్లు 33 మంది నామినేషన్ లు వేశారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులకు 157 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో కాంగ్రెస్ నుంచి 42 మంది నామినేషన్ లు వేయగా బీఆర్ఎస్ నుంచి 42, బీజేపీ నుంచి 42, బీఎస్పీ నుంచి నలుగురు, సీపీఎం నుంచి ముగ్గురు, ఇతర పార్టీల నుంచి ఆరుగురు, ఇండిపెండెంట్లు 18 మంది నామినేషన్లు వేశారు. లక్షెట్టిపేటలో ప్రతి ప్రధాన పార్టీ నుంచి 42 నామినేషన్లు వేయడం గమనార్హం.

ముగిసిన నామినేషన్ లు...

జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లోని 149 వార్డులకు మూడు రోజుల్లో 1599 నామినేషన్లు దాఖలయ్యాయి. మరో వైపు ఆయా పార్టీల్లో ఒక్కో వార్డు నుంచి ఇద్దరు, ముగ్గురు బీ ఫాం కోసం ఎదురు చూసినా ఒక్కరికే అవకాశం ఉండటంతో టికెట్టు రాని వారు ఇండిపెండెంటుగా పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. బీ ఫారం అందజేయడానికి ఇంకా సమయం ఉండటంతో ఎవరిని వరించేనో ఎదురు చూస్తున్నారు.

మున్సిపాలిటీ     వార్డులు       మొదటి రోజు    రెండవ రోజు         మూడవ రోజు      మొత్తం

‌--------------------------------------------------------------

మంచిర్యాల              60               20                       166                         429                 615

బెల్లంపల్లి                  34               10                        87                          264                 361

చెన్నూర్                   18                 3                        26                          196                 225

క్యాతనపల్లి                22                 2                        30                          209                 241

లక్షెట్టిపేట                15                 0                        30                          127                 157

‌--------------------------------------------------------------

మొత్తం                     149               35                     339                        1225               1599

--------------------------------------------------------------