calender_icon.png 31 January, 2026 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

31-01-2026 10:51:57 AM

నాగల్ గిద్ద,జనవరి 30: నాగల్ గిద్ద మండల కేంద్రంలోని మోర్గి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 2026-2027 సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో సీట్ల కోసం, అలాగే 7,8,9,10వ తరగతులలో మిగిలి ఉన్న ఖాళీ సీట్ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సువర్ణ శుక్రవారం పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రయాణం అయిందని తెలిపారు.

ఈ సందర్భంగా మంచి నాణ్యత గల ఇంగ్లీష్ మీడియం బోధన, మంచి అనుభవం కలిగిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్య బోధన ఉంటుందని సూచించారు. ఉచిత యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, ప్రభుత్వ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు http://telanganams.cgg.gov.in వెబ్సైట్ ద్వారా లేదా మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 19.04.2026న ఈ ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.