calender_icon.png 25 August, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానంపై అవగాహన పెరగాలి

21-11-2024 12:00:00 AM

చాలామందికి రక్తదానంపై అనేక అపోహలు ఉన్నాయి. అత్యవసర సమయంలో రక్తం అవసరమైతే ఇవ్వడానికి చాలా మంది ముందుకు రాకపోవడం దురదృష్టకరం. ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునని వైద్య నిపుణులు చెప్తారు. రక్తదానం చేసేవారి శరీరంలోకి మరో రకంగా కొత్త రక్తం వస్తుందన్న విషయమూ ఇక్కడ గమనార్హమే. ఈ ప్రాధా న్యాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. రక్తదాన కార్యక్రమాలను చేపట్టే వారిని, సంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. కళాజాత బృందాలను ఏర్పరిచి గ్రామాలలో తగు అవగాహన కలిగించాలి. అత్యవసర సమయాల్లో రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావలసిన పరిస్థితులు కల్పించాలి. అప్పుడు బాధితులకు పెద్ద భరోసా ఇచ్చిన వాళ్లమవుతాం.

 -షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్