16-07-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల అర్బన్, జూలై 15 (విజయ క్రాంతి): ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు అ ధిక లాభాలు పొందవచ్చు అని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.మంగళవారం ఉద్యా న వన శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గొల్లపల్లి మం డలంలో నిర్వహించిన ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ సత్య ప్ర సాద్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రైతు బుర్రవేణి తిరుపతి క్షేత్రంలో 6 ఎకరాలలో కలెక్టర్ ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయి ల్ పామ్ మొక్క నాటిన 3 సంవత్సరాల నుండి దిగుబడి ప్రారంభమై 30 సంవత్సరాల వరకు కొనసాగుతుందన్నారు.ఆయిల్ ఫామ్ మొక్కల ను 90% సబ్సిడీ పై రు.20 లకే ఇస్తున్నామని, డ్రిప్ పై 80-100% స బ్సిడీ అందిస్తున్నామని, ప్రతి ఎకరానికి రు.4200 సంవత్సరానికి చొప్పున 4 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు చెల్లిసు న్నామన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 4700 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు ఉన్నాయని, వరి పంటతో పోలిస్తే అకాల వర్షాలు, వడగళ్ళ వానలవల్ల నష్టం ఉండదని, కోతు ల బెడద ఉండదని,1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం గెలలను ప్రభుత్వం నిర్దారించిన రేట్ కు కంపెనీ కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీవో మధుసూదన్‌జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి శ్యామ్ ప్రసా ద్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్,గొల్లపల్లి ఎమ్మార్వో , వ్యవసాయ అధికారి, ఉ ద్యాన అధికారులు, ప్రజాప్రతినిధులు, లో హియా జిల్లా మేనేజర్ విజయ్ భరత్, క్షేత్ర సిబ్బంది, డ్రిప్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.