16-07-2025 12:00:00 AM
మైనారిటీ గురుకుల కార్యదర్శి షఫీయుల్లా
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాలు, వసతిగృహాల్లో ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఉన్నతాధికారుల కు మైనారిటీ గురుకుల కార్యదర్శి షఫీయు ల్లా సూచించారు. మంగళవారం సచివాలయంలో సంక్షేమ గురుకులాలు, వసతిగృహా ల్లో నిత్యావసర సరకుల ప్రొక్యూర్మెంట్, ఇత ర సరుకుల సేకరణపై సమావేశం నిర్వహిం చారు.
టెండర్ ప్రక్రియను పారదర్శకంగా ని ర్వహించాలనారు. ఈ సందర్బంగా కమిటీల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ వేగవంతం చేయడంలో ప్రా జెక్టు మానిటరింగ్ యూనిట్ చైర్మన్, ఎస్సీ గురుకుల సెక్రటరీ డాక్టర్ అలుగు వర్షిణిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.