16-07-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ జూలై 15 (విజయ క్రాంతి) : జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న హన్వాడ మండలం ఆవిర్భావం చేసినప్పటి ఆ వసతి గృహం సమస్యల నిలయం గా మారింది. గత మూడేళ్ల క్రితం జిల్లా కేం ద్రానికి సమీపంలో ఉన్న హన్వాడ మండ లం కేంద్రంలో ఎస్సీ బాలుర వసతిగృహం గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
వసతి గృ హం ప్రారంభించడంతో చుట్టుపక్కల ఆయా గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు ఇత ర ప్రదేశాలలో వివిధ పనుల నిమిత్తం వలస పోవడంతో వారి బిడ్డలను ఈ వసతి గృ హంలో ఉంచి చదివిస్తున్నారు. కాగా మూడంటే మూడే గదులలో ఈ వసతి గృ హంలో 160 మంది విద్యార్థులు, వారికి సం బంధించిన పుస్తకాలు, పెట్టెలు, మంచాలు ఉన్నాయి.
ఈ గదులలోనే విద్యార్థులు నిద్రపోయేందుకు రాత్రి అయ్యిందంటే చాలు విద్యార్థులు వణుకు పుడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు అం దుబాటులో ఉన్న.. ఈ వసతిగృహంపై పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ విద్యాభ్యాసం చేస్తున్నారు.
-ఒంటికి.. ఇంటికి బయటికే..
మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ వసతి గృహంలో విద్యార్థులు ప్రారంభించినప్పటి నుంచి ఒంటికి ఇంటికి ఆరు బయ టికి వెళ్ళవలసిన దుస్థితి నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఐదు బాత్రూంలో ని ర్మాణం చేసినప్పటికీ ఇంకా అవి ప్రారంభం కాలేదు. ఒకటో అంతస్తులో స్లాబ్ వేసినప్పటికీ చుట్టుముట్టు గోడలు నిర్మాణం చేయక పోవడంతో ఉన్న గదుల్లోనే విద్యార్థులు కా లాన్ని నెత్తుకొస్తున్నారు.
పక్కనే ఉన్న ఓ ప్రభుత్వ గది ఉండడంతో రాత్రిపూట వెళ్లి దాదాపు 15 మంది విద్యార్థులు అక్కడబినిద్రపోయి తిరిగి ఉదయం హాస్టల్ కు వచ్చే దుస్థితి ఉంది. ఈ సమస్యను పరిష్కరించేలా ఉన్నత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు, వారి తల్లి దండ్రులు కోరుతున్నారు.
-కాస్త విద్యార్థులపై దయ చూపండి...
అవసరం ఉన్న లేకపోయినా ఉన్న రో డ్లను తీసివేసి తిరిగి రోడ్లను వేస్తూ ఇలా ఎ న్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న ప్ర భుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులు ఒక్కసారి హన్వాడ మండలంలోని ఎస్సీ బాలుర వస తి గృహాన్ని సందర్శించండి. తక్కువ డబ్బులు మంజూరు చేస్తేనే అక్కడ ఉన్న వి ద్యార్థులకు ఎంతో మెలు చేకూరుతుంది.
కనీ సం బాత్రూంలు లేక, నిద్రపోయేందుకు స్థ లం లేక విద్యార్థులు ప్రతి రాత్రి ఈ రాత్రి గ డిస్తే చాలు అనేలా ఇబ్బందులు ఎదుర్కొం టూ చదువులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వసతి గృ హాన్ని సందర్శించి అవసరమైన సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
- పక్కనే అధికార యంత్రాంగం..
మలవిసర్జన అరు బయట చేయకూడద ని నిత్యం ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, సంబంధిత అధికారులు వివిధ గ్రామాలలో ప్రజలకు అవగతం చేస్తూ వస్తున్నారు. కాగా పక్కనే ఉన్న 160 మంది విద్యార్థులు ఒకటికి రెండిటికీ బయటికి వెళ్తే నివారణ చర్యలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా రు.
ఏండ్ల తరబడి ఈ ప్రక్రియ యధావిధిగా కొనసాగుతున్నప్పటికీ విద్యార్థుల కన్నీళ్లను ఆపే వారే కరువయ్యారు. తాసిల్దార్ కార్యాల యం కూడా ఈ వసతి గృహానికి సమీపంలోనే ఉంది. ఉన్నతాధికారులు ఒక్క మారు వసతి గృహాన్ని సందర్శించి నెలకొన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిం చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-విద్యార్థులకు ఇబ్బందులు వాస్తవమే...
సంబంధిత ఉన్నదా అధికారులకు సమాచారాన్ని అందించడం జరిగింది. ఉన్న మూ డు గదుల్లో విద్యార్థులు ఉంటు న్నారు. 160 మంది విద్యార్థులు ఉన్న గదు ల్లో ఉండేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాత్రూంలో ప్రస్తుతం ఐదు నిర్మాణంలో ఉన్నాయి. ఈ బాత్రూంలో కూడా ఎంతమంది విద్యార్థులకు సరిపోవు.
ప్రస్తుతం విద్యార్థులు మలమూత్ర విసర్జనకు బయటికే వెళుతున్నారు. మొదటి అంతస్తులో స్లాప్ వేయడం జరిగింది. గోడలు ఏర్పాటు చేస్తే విద్యార్థులు ఉండేందుకు వీ లుంటుం ది. మరిన్ని బాత్రూంలు కూడా నిర్మాణం చేయవలసి ఉంది. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం వాస్తవం.
సత్యనారాయణ, వార్డెన్,
ఎస్సీ బాలుర వసతిగృహం, హన్వాడ.