23 March, 2026 | 6:04 AM

హైరైజ్.. నయా రూల్స్!

23-03-2026 12:59 AM
  1. తెలంగాణ భవన నిర్మాణ రంగం నిబంధనల్లో పెనుమార్పులు.. జీవో 95 విడుదల
  2. హైరైజ్ భవనాలపై కొత్త విధానం
  3. అదనపు అంతస్తులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
  4. టీడీఆర్ వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలు
  5. రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊతమిచ్చేలా సర్కారు కీలక నిర్ణయం

హైదరాబాద్, సిటీ బ్యూరో, మార్చి 22 (విజయక్రాంతి):  రాష్ట్రంలో భవన నిర్మాణ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు, నగరంలో అభివృద్ధిని ప్రోత్సహించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ భవన నిర్మాణ నిబం ధనలు 2012కు కీలక సవరణలు చేస్తూ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ తాజాగా జీవో నం.95ను విడుదల చేసింది.

ఈ నూతన నిబంధనల ద్వారా హైరైజ్ భవనాల నిర్వచనాన్ని సవరించడంతో పాటు, టీ డీఆర్ వినియోగం, అదనపు అంతస్తుల ని ర్మాణం, సెట్‌బ్యాక్ సడలింపులపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ప్రకటించింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్‌రంజన్ పేరుతో వెలువడిన ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.  తాజా నిబంధనల ప్ర కారం, హై రైజ్ భవనాల గుర్తింపులో మా ర్పులు చేశారు.

ఇకపై 21 మీటర్లు లేదా అం తకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను మా త్రమే హై-రైజ్ కేటగిరీ కింద పరిగణిస్తారు. అయితే, భవన ఎత్తును లెక్కించేటప్పుడు పారిశ్రామిక భవనాల్లో ఉండే చిమ్నీలు, కూలిం గ్ టవర్లు, బాయిలర్ రూములు, లిఫ్ట్ మెషి న్ గదులు, వాటర్ ట్యాంకులు ఇతర నిర్మా ణ ఫీచర్లను పరిగణనలోకి తీసుకోరు. దీనివల్ల సాంకేతిక కారణాలతో భవన ఎత్తు పెరిగినా, అనుమతుల ప్రక్రియలో బిల్డర్లకు కొంత వెసులు బాటు లభించనుంది. టీడీఆర్ వినియోగంపై ప్రభుత్వం కఠినమైన, పారదర్శక మైన నిబంధనలను రూపొందించింది.

ముఖ్యం గా 750 చదరపు మీటర్ల నుంచి 2000 చదరపు మీటర్ల మధ్య ఉండే ప్లాట్ల లో 18 మీటర్ల నుంచి 21 మీటర్ల ఎత్తు వరకు భవనాలు నిర్మించాలంటే టీడీఆర్ వాడటాన్ని తప్పనిసరి చేశారు. భారీ భవనాల విషయం లో లోడింగ్ నిబంధనలను కూడా ఖ రారు చేశారు. 10  నుంచి 20 అం తస్తుల లోపు ఉండే భవనాలకు, 10వ అంతస్తుకు పైబడిన బిల్ట్-అప్ ఏరియాపై 3 శాతం టీడీఆర్ లోడింగ్ ఉండాలని స్పష్టం చేశారు. అలాగే 20 అంతస్తులు దాటిన భవనాలకు 20వ అంతస్తుకు పైబడిన ఏరియాపై 5 శాతం టీడీఆర్ వినియోగించాల్సి ఉం టుంది.

ఈ టీడీఆర్ మొత్తంలో 50 శాతాన్ని భవన అనుమతి సమయంలోనే సమర్పించాలని, మిగిలిన 50 శాతాన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందే లోపు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  2000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లా ట్లలో రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తుల నిర్మా ణానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. 40 ఫీట్ల రోడ్డు ఉంటే 3 అదనపు అంతస్తుల వరకు, 60 ఫీట్ల రోడ్డుకు 4 అంతస్తులు, 80 ఫీట్ల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్డుకు 5 అదనపు అంతస్తుల వరకు నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు.

ఈ నిర్మాణాలు కచ్చితంగా అగ్నిమాపక, విమానాశ్రయ అథారిటీ నిబంధనలకు లోబడి ఉం డాలని స్పష్టం చేశారు. హైరైజ్ భవనాల సెట్‌బ్యాక్ నిబంధనలలో కూడా ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. టీడీఆర్ వినియోగించే భవనాల్లో అనుమతించబడిన సెట్‌బ్యాక్స్‌లో 10 శాతం వరకు రిలాక్సేషన్ పొందే అవకాశం కల్పించారు.  భద్ర తా కారణాల దృష్ట్యా భవనం చుట్టూ కనీ సం 7 మీటర్ల సెట్‌బ్యాక్ ఉండాలనే నిబంధనను మాత్రం కచ్చితంగా పాటించాలి.

ఒకవే ళ మాస్టర్ ప్లాన్ రోడ్ల మార్పులు లేదా తొలగింపు జరిగినప్పుడు, దరఖాస్తుదారులు వర్తించే కన్వర్షన్ ఛార్జీలు చెల్లించడానికి బదులుగా, దా నికి సమానమైన టీడీఆర్‌ను సమ ర్పించే కొత్త వెసులుబాటును సర్కార్ కల్పించిం ది.  ఈ నిర్ణయం వల్ల నగరంలో భవన ని ర్మాణ ప్రక్రియ మరింత వేగవంతం కావడ మే కా కుండా, భూమి లభ్యత తక్కువగా ఉ న్న ప్రాంతాల్లో అభివృద్ధికి మార్గం సుగ మ మవుతుందనని అధికారులు భావిస్తున్నారు.