17 July, 2026 | 2:26 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

పవన్ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. హైకోర్టులో జనసేన రిట్ పిటిషన్

02-06-2026 12:07 PM

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan Press Meet) మంగళవారం సాయంత్రం 4:30- 5.30 గంటలకు జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించనున్నారు. సోషల్ మీడియా వేదిక 'X'లో ఆయన పంచుకున్న ఒక ప్రకటన ప్రకారం, పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడనున్నారు.

ఈ సమావేశానికి పోలీసులు అనుమతి ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశం కీలక రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. కనీసం ప్రెస్‌మీట్‌కైనా పోలీసులు అయినా అనుమతి ఇస్తారా? లేదా? అంటూ పవన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అటు జనసేన లీగల్ టీమ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది 

జనసేన బృందం రిజిస్ట్రార్‌ను కలిసి రిట్ పిటిషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైదరాబాద్‌లో జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. కోర్టులో సభకు అనుమతి వస్తే సభలోనే పవన్ ప్రసంగించనున్నారు. సభకు అనుమతి రాకపోతే పవన్ ప్రెస్ మీట్  పెట్టనున్నారు. కోర్టులో తీర్పుపై జనసేన నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.