17 July, 2026 | 2:09 PM

Breaking News

స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •  

అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు

02-06-2026 11:52 AM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి...

బాన్సువాడ, జూన్ 2 (విజయ క్రాంతి): అమరవీరుల త్యాగ ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తన నివాసం వద్ద,ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయ ఆవరణలో పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర,బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  RDO రవీందర్ రెడ్డి, బాన్సువాడ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయలక్ష్మి, బాన్సువాడ పట్టణ,రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.