29 April, 2026 | 3:21 AM

నాణ్యమైన విత్తనాలతోనే.. అధిక దిగుబడులు

29-04-2026 12:52 AM

మానకొండూరు, ఏప్రిల్ 28 (విజయ క్రాంతి): అధిక దిగుబడి ఇచ్చేందుకు దోహదపడే విత్తనశుద్ధిపై రైతులు ప్రత్యేక దృష్టి సా రించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రైతులను కోరా రు. ఆధునిక వ్యవసాయంలో నాణ్యమైన విత్తనం అధిక దిగుబడి సాధించడానికి దోహదపడుతుందన్నారు. మానకొండూర్ మండలం రంగపేట గ్రామంలో మంగళవా రం విత్తనశుద్ధి మిషన్, గోదాంను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్.అన్వేష్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ . రైతుల దృష్టి పంట దిగుబడులపై మాత్రమే ఉంటుందని, ధాన్యాన్ని శు ద్ధి చేయడం, నాణ్యతా ప్రమాణాలు పాటించడంపై వారి ధ్యాస ఉండదన్నారు. ఇప్పటికైనా రైతులు విత్తన శుద్ధిపై ఆసక్తిని పెంచుకో వాలన్నారు. అధిక దిగుబడులిచ్చే వంగడాలను ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు రూపొందారని, వాటిని మాత్రమే సాగు చేసి అధిక లాభాలు గడించాలని ఎమ్మెల్యే కోరారు.

మార్కెట్ లో వివిధ కంపెనీల పేరిట లభించే వంగడాలతో పంటలు సాగుచేసి నష్టాలపాలు కావొద్దన్నారు. గత పాలకులు వ్యవసాయాన్ని, రైతంగాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. నకిలీ వంగడాలు,ఎరువులు, పురుగు మం దులు వాడి రైతులు నిలువునా నష్టాలపాలయ్యారని, నష్టాలు పూడ్చలేని స్థితిలో రైతు లు ఆత్మహత్యలకు పాల్పడే వారని, ఈ ఆత్మహత్యల పరంపర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చా క ఆగిపోయిందన్నారు.

కల్తీ పురుగు మందు లు, ఎరువులు, నాసిరకం వంగడాల అమ్మకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లెం వేసిందని డాక్టర్ కవ్వంపల్లి గుర్తు చేశారు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతిగా పని చేస్తున్నదని ఆయన చెప్పారు.ఏది రైతు ప్రభుత్వ మో, ఏది రైతు వ్యతిరేక ప్రభుత్వమో ప్రజ లు, రైతులు గమనించాలని ఆయన కోరా రు.

రైతులను అణగదొక్కేందుకు నల్ల చట్టా లు తీసుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం మంచి దా, అడుగడుగున రైతులను వంచించి పీకలలోతు నష్టాల్లోకి నెట్టిన గత బీఆర్‌ఎస్ పా లకులు మంచోళ్లో తేల్చుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందరిగి రవీంద్రచారి, మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ రేమిడి తిరుమల్ రెడ్డి, మానకొండూరు సిఐ శ్రీలత, తదితరులున్నారు.