ఉజ్వల భవిష్యత్ కోసం ఉన్నత విద్య
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్,ఏప్రిల్ 28(విజయక్రాంతి): బాల్యవివాహాల వల్ల బతుకులు ఆగం అవుతాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. చదువుపై దృష్టిసారించి ఉజ్వల భవిష్యత్ కోసం క్రమ శిక్షణతో ఉన్నత విద్యను అభ్యసించాలని బాలికలకు సూచించారు. మంగళవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్య క్రమంలో భాగంగా శ్రీ శిశుసంక్షేమ శాఖ, రేయిన్బో హోం అనాథాశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో టీనేజ్ గరల్స్ ప్రెగ్నెన్సీ, చైల్ మ్యారేజ్‌పై అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమ ని, 18 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు వివాహం చేసిన వారిపై కేసు నమోదు అవుతాయని హెచ్చరించారు. కౌమార దశలో బాలికలు జాగ్రత్తగా ఉండాలని చిన్న పొరపాటు వల్ల జీవితాంతం ఇబ్బందులు పడా ల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. బాలికలు బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
ప్రేమ పేరుతో మాయ మాట లు చెప్పి కొంత మంది బాలికలను లోబర్చుకుంటారని, వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ, సీడీపీవో స్వప్న, డీసీపీవో శ్రీనివాస్, ఎస్త్స్రలు రాజేష్, నస్రీన్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు టి. సోమన్, రెబ్బరామారావు, ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పార్టీ నాయకులు శ్రీనివాస్, జావిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.






