26 June, 2026 | 6:55 PM

Breaking News

సిద్దిపేట జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా నత్తి శివకుమార్   •   ఉరి వేసుకుని వార్డు మెంబర్ ఆత్మహత్య   •   ఎల్లమ్మ ఆలయానికి రూ.50 వేల విరాళం...   •   ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •  

కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా భార్య అదృశ్యం

29-04-2026 01:11 AM

జవహర్‌నగర్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): భార్య భర్తల మధ్య కుటుంబ తగా దాలు చోటు చేసుకోగా మనస్థాపం చెందిన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైంది. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌ఓ సైదు లు తెలిపిన కథనం ప్రకారం... జవహర్ నగర్ లోని బాలాజీ నగర్ చంద్రపురి కాలనీలో సఫావత్ రాజు భార్య జ్యోతి ఇద్దరు కుమారులు జస్వంత్ యశ్వంత్‌తో కలిసి నివసిస్తు న్నారు. అన్యోన్యంగా సాగుతున్న కుటుంబంలో ఇటీవల గొడవలు చోటు చేసుకుం టున్నాయి.

ఈనెల 24న రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా మనస్తాపం చెందిన జ్యోతి(30) మరసటి రోజు ఇంట్లో చెప్పకుండా పిల్లలను తీసుకొని బయటికి వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికిన సమాచారం లభించలేదు. ఈ మేరకు భర్త రాజు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యా దు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.