మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి
- మొరం టెండర్ల విషయంలో అధికారులపై చర్యలు తీసుకోవాలి
- మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి స్వామి
కామారెడ్డి, ఆగస్టు 7 (విజయక్రాంతి): మున్సిపల్ సమస్యలపై ఉన్నదా అధికారులు స్పందించాలని కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి అన్నారు. శుక్రవారం టిఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ కు స్థానిక సంస్థల అసిస్టెంట్ కలెక్టర్ గిరికి వినతి పత్రం అందజేశారు. మునిసిపల్ లో జరుగుతున్న పరిణామాలు మున్సిపల్ మీటింగ్లు సక్రమంగా నిర్వహించడం లేదని మున్సిపల్ వార్డుల్లో గత ఆరు నెలల నుండి చెత్తను సేకరించుటకు తీవ్ర జాప్యం జరుగుతుందని అన్నారు.
ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుచున్నందున కొత్త ఆటోలను కొనుగోలు చేయుటకు తమరి అనుమతి వెంటనే ఇవ్వగలరని కోరారు. మున్సిపల్ జెసిబి ని కామారెడ్డి పురపాలక సంఘ చైర్మన్ ఉమా రాణి భర్త శ్రీనివాస్ ఆధీనంలో ఉంచుకొని నడిపించడం జరుగుతుందన్నారు. జెసిబి ని బాధ్యత గల మున్సిపల్ అధికారి ఆధీనంలో ఉండేటట్లు చూడగలరు.మున్సిపల్ ఆఫీసులో ప్రైవేటు వ్యక్తులు మున్సిపల్ సిబ్బందిపై అజమాయిషీ చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోగలరని కోరారు.
జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ మంజూరు చేసిన మొరం టెండర్ల విషయంలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ లు అర్కల ప్రభాకర్ యాదవ్, లక్ష్మీనారాయణ, స్వప్న, బాలమణి,కుంభాల రవి యాదవ్, అజీజ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.






