8 August, 2026 | 1:17 AM

గ్రామకంఠం భూమి రక్షణకు ఎంపీడీవో కార్యాలయం ముట్టడి

08-08-2026 12:00 AM

ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 7(విజయక్రాం తి):  దండుమైలారంలోని గ్రామకంఠం భూమిని మాజీ సర్పంచ్ జనార్దన్ రెడ్డి ఆక్రమించారంటూ గ్రామస్తులు 14 రోజులుగా చేపడుతున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చిం ది. ఈ భూమిని స్వాధీనం చేసుకుని, ఇల్లు లేని పేదలకు 60 గజాల చొప్పున కేటాయించాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్, ఉపసర్పం చ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు గురువారం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు.

సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో  ఆగ్రహించిన గ్రామస్తులు ఆందోళన కు దిగగా, ఓ వ్యక్తి ఆవేదనతో టేబుల్ పై బలంగా చేతితో కొట్టడంతో ఫర్నిచర్ ధ్వంస మైంది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో సీఐ మహేందర్ రెడ్డి, సర్పంచ్ నరేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా, వివాదాస్పద భూమిపై సర్వే చేసి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఎంపీడీవో ప్రమీల నాయక్ ఎమ్మార్వోను ఆదేశించారు.