రిపుల్స్ లర్నింగ్ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు
08-08-2026 12:00 AM
బాన్సువాడ, ఆగస్టు 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రిపుల్స్ లర్నింగ్ పాఠశాలలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలంగాణ సంప్రదాయ దుస్తులు ధరించి బోనాల వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.విద్యార్థులు ఉపాధ్యాయులు బోనం ఎత్తుకుని నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల ఆవరణ సందడిగా మారింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేసేలా ఈ వేడుకలను నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాజా బాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






