07-01-2026 01:12:36 AM
బీజేపీ సభా పక్ష నేత ఏలేటి
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): ప్రభుత్వం చేపడుతున్న హిల్ట్ పాలసీ పరిశ్రమలను మూసేలా ఉం దని, జీవో 27 చాలా వి వాదాస్పదంగా ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయ న మాట్లాడారు. హిల్ట్ పాలసీకి సంబంధించి సబ్ కమిటీ నిర్ణయాలను బయట పెట్టలేదు.. 22 పారిశ్రామికవాడలను అన్యాక్రాంతం చేస్తున్నారు.. ఫార్మాసిటీకోసం రైతుల నుంచి సేకరించిన భూములను ఫోర్త్ సిటీకి ఉపయోగిస్తున్నారు. ఆ భూములపై హైకోర్టు ఆఫిడవిట్ అడిగింది. పరిశ్రమలను మూసివేసేలా ప్రస్తుత పాలసీ ఉందన్నారు.
గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలో తప్పులు ఉంటే వాటిపై చర్యలు తీసుకోవాలి. పరిశ్రమల భూములను రియల్ ఎస్టేట్ భూములుగా మా ర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 43,342 జీవోలు దాచి పెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం 19,064 జీవోలు ఇస్తే.. 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయి అని ఆరోపించారు.