calender_icon.png 13 January, 2026 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులను వెంటనే ఇవ్వాలి

07-01-2026 01:12:36 AM

వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ కార్యాల యాన్ని ముట్టడించిన నిరుద్యోగులు

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): వైద్య ఆరోగ్యశాఖలో సెలెక్ట్ అయిన 1286 ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టింగ్ లను వెంటనే ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సెలెక్ట్ అయిన 1286 మంది ల్యాబ్ టెక్నిషన్స్ వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని 1200 మంది నిరుద్యోగులు కోఠి లోని వైద్య ఆరోగ్య శాఖా డైరెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా హాజరైన ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ సెలెక్ట్ అయిన వారికి వెంటనే పోస్టింగ్స్ ఇవ్వడానికి అధికారులతో మాట్లాడి తొందరగా వచ్చేటట్లు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వైద్య - ఆరోగ్యశాఖలో ఒకేసారి భారీ మొత్తంలో 5500 స్టాఫ్ నర్స్ పోస్టులను 1286 ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులను భర్తీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వైద్య - ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహను ఆయన అభినందించారు. గతంలో ప్రభుత్వాలు అనేకసార్లు ఉద్యమా లు చేసినప్పటికీ 100 పోస్టులు కూడా భర్తీ చేయలేదని, పెద్ద మొత్తంలో భర్తీ చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఒక సంవత్సరం మొత్తం రిక్రూట్ మెంట్ ప్రాసెస్ జరిగిందని, చివరకు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ గా పోస్టింగ్స్ ఆగిపోయాయన్నారు. ఇప్పుడు ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన మొదటి నోటిఫికేషన్ (నెం.03/2024) ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఉద్యోగాల ఈ ప్రక్రియ ప్రారంభమై దాదాపు ఏడాది గడుస్తోందన్నారు. సెలెక్టెడ్ అభ్యర్థులకు వెంటనే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖా డైరెక్టర్ రవీందర్ నాయక్ తో ఆర్. కృష్ణయ్య చర్చించడంతో వచ్చే శనివారంలోగా పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ధర్నాలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల భరత్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, జిల్లపల్లి అంజి, జి. అనంతయ్య, రాందేవ్ మోడీ, సీ. రాజేందర్, ప్రవీణ్ ముదిరాజ్, బీసీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు జి. పద్మ తదితరులు పాల్గొన్నారు.