17 June, 2026 | 10:50 PM

శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం వ్యవసాయ భూములు కౌలు బహిరంగ వేలం

17-06-2026 09:26 PM

కోదాడ,(విజయక్రాంతి): మండల పరిధిలోని తొగర్రాయి గ్రామం శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయ వ్యవసాయ భూములు కౌలు బహిరంగ వేలం ఆలయ ప్రాంగణంలో దేవాలయ కార్య నిర్వహణ అధికారి తుమ్మల వెంకట చలపతి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ వేలంపాటలో 2026-27 సంవత్సరాలకు కౌలుకు 121 సర్వేనెంబర్ లో 3 ఎకరాల30 కుంటల భూమిని వంక అప్పారావు 97 వేల రూపాయలకు, అదే సర్వే నెంబర్ లోని 5 ఎకరాల భూమిని పులి సులోచనరావు 2 లక్షల20 వేల రూపాయలకు, 23 సర్వేనెంబర్ లో ఎకరం 30 కుంటల భూమి 16 వేల రూపాయలకు, 125 సర్వే నెంబర్ లోని 10 ఎకరాల 8కుంటల భూమి ని నాలుగు లక్షల 15 వేల రూపాయలకు బహిరంగ వేలములో కౌలు రైతులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లిక్కి వెంకటయ్య, దేవాలయ చైర్మన్ మదన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచన రావు, తదితరులు పాల్గొన్నారు.