18 August, 2026 | 7:58 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు

05-05-2026 08:18 PM

రుద్రంగి,(విజయక్రాంతి): హిందూ సమ్మేళనం రోజు రుద్రంగి గ్రామంలో అలంకరించిన హిందూ జెండాలను, కాషాయ తోరణాలను గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించడంతో వివాదం నెలకొంది. గ్రామ పంచాయితీ సర్పంచ్ మరియు కార్యదర్శి ఆదేశాల మేరకే తొలగిస్తున్నమని సిబ్బంది చెప్పడంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా కార్యదర్శి నంద్యాడపు వెంకటేష్  గ్రామ కార్యదర్శి కి ఫోన్ చేయగా చెత్త తో పాటు చెత్త జెండాలను  తొలగించమని కార్యదర్శి వర్ణించడం బాధాకరమని అన్నారు.

పార్టీ జెండాలను ఫ్లెక్సీలను తొలగించిన పట్టించుకునే వాళ్ళము కాదని కానీ హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విదంగా హిందువుల జెండాను తొలగించి చెత్త ట్రాక్టర్ లో పడేయడం బాధాకరమని అన్నారు.ఇలా జరగడం 3వ సారి అని అధికార పార్టీ గ్రామ సర్పంచ్ గతంలో కూడా ఇలా తొలగించడం జరిగిందని, హిందువుల పట్ల విద్వేషం చూపిస్తున్నాడని, ఇది మంచి పరిణామం కాదని, గ్రామంలో ఎక్కడిక్కడే చెత్త చెదారం పేరుకుపోయిందని దాని గురించి చర్యలు తీసుకోకుండా హిందువుల జెండాలను తోరణాలను తొలగించడం ఏంటని నిలదీశారు.

ఎవరు చెపితే తోరణాలు తీసేసారో వాల్లపేరు చెప్పాలని కార్యదర్శి ని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ బిఆరెస్ పార్టీ ఫ్లెక్సీలు రెండు మూడు నెలలు ఉన్న తొలగించరు కానీ హిందువుల జెండాలను ఎలా తొలగిస్తారని అధికారులను ప్రశ్నించారు. కార్యదర్శిని మీద చర్యలు తీసుకొని తొలగించాలని ఎంపిడిఓ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు.