2 July, 2026 | 4:07 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

నేడు గో డిజిట్ ఐపీవో లిస్టింగ్

23-05-2024 12:05 AM

ముంబై, మే 22: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, ఆయన సతీమణి, సినీనటి అనుష్క శర్మలకు పెట్టుబడులు ఉన్న డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు స్టాక్ ఎక్సేంజీల్లో మే 23న లిస్టవుతాయి. ఈ కంపెనీ జారీచేసిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) 10 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది.  ఐపీవోలో 5.28 కోట్ల షేర్లను కంపెనీ జారీచేస్తుండగా, 50.70 కోట్ల షేర్లకు బిడ్స్ అందాయి. రూ.2,615 కోట్ల సమీకరణకు వచ్చిన ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,125 కోట్ల విలువైన 4.14 కోట్ల షేర్లను తాజా ఈక్విటీగా జారీచేస్తుండగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రూ.1,489 కోట్ల విలువైన షేర్లను విక్రయి స్తున్నారు. ఐపీవో ధరను రూ.272గా నిర్ణయించారు. రిటైల్ విభాగంలో 4.27 రెట్లు స్పందన లభించింది.