27-01-2026 01:55:34 PM
భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం
న్యూఢిల్లీ: భారత్ భాగస్వామ్యం సరికొత్త శిఖరాలకు చేరుతోందని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. భారత్-ఈయూ మధ్య మంగళవారం నాడు చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రధాని మోదీ ఇండియన్ ఎనర్జీ వీక్ వేదికగా ప్రకటించారు. ఈ ఒప్పందాన్ని "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్"గా అభివర్ణించారు. ఈ ఒప్పందంతో భారత వాణిజ్యంలో సరికొత్త శకం మొదలైదని తెలిపారు. భారతదేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద స్వేచ్ఛావాణిజ్య ఒప్పందమని ప్రధాని పేర్కొన్నారు. టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ రంగాల్లో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం జరిగిందన్నారు. ప్రపంచ జీడీపీలో 25 శాతం, వాణిజ్యంలో మూడో వంతు వాటా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. కోట్లాది భారతీయులకు, యూరోపియన్లకు అపారమైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు.