calender_icon.png 27 January, 2026 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాగి జావా రుచిచూసిన కలెక్టర్

27-01-2026 02:15:16 PM

ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ

పిల్లలకి అర్థమయ్యేలా విద్యా బోధన ,నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశం

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నాణ్యమైన బోధనతో పాటు రుచికరమైన, పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ మండలం పాడిబండ గ్రామంలోని గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు.  తరగతి గదుల్లో బోధనా విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి, వంటశాల పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా వండిన రాగి జావాను తాగి రుచి చూశారు. విద్యార్థుల హాజరు వంద శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.