27-01-2026 02:16:59 PM
జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్
జైనూర్(విజయ క్రాంతి): ప్రజల పక్షాన విజయ క్రాంతి పత్రిక నిలబడుతుందని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్ అన్నారు. మంగళవారం జైనూర్ మార్కెట్ యార్డులో రిపోర్టర్ ముండే శివకుమార్‌తో కలిసి విజయ క్రాంతి దినపత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అనతి కాలంలోనే విజయ క్రాంతి పత్రిక ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడంతో పాటు అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి పత్రిక చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. జర్నలిజం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కడప ప్రకాష్, ఉపసర్పంచ్ డోంగ్రే ప్రకాష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిర్లే లక్ష్మణ్, బీఆర్‌ఎస్ నాయకులు అంబాజీ, సోలంకి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.