calender_icon.png 27 January, 2026 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోట్ బుక్స్ పంపిణీ

27-01-2026 02:52:22 PM

మోతె,(విజయక్రాంతి): మండల పరిధిలోని గోపతండ గ్రామా ఉపసర్పంచ్ మాలోతు ఈశ్వరి రవిల కుమార్తె లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ప్రాథమిక ఉన్నంత పాఠశాల పిల్లలకు నోట్ బుక్కులు, పెన్నులు, ప్యాడ్ లు, పెన్సిల్లు, గ్రామ సర్పంచ్ భూక్య బిక్కుతో కలిసి సుమారు 40 మంది పిల్లలకు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ భూక్య బిక్కు, ఉప సర్పంచ్ మాలోతు ఈశ్వరి రవిలు మాట్లాడుతూ.... దేశం ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే విద్య అభివృద్ధితోనే సాధ్యమవుతుందని తెలిపారు. పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, గ్రామ కార్యదర్శి ఎస్.కె సొందు, వార్డ్ మెంబర్లు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.