హితేశ్ తీన్మార్
23-04-2024 01:05 AM
హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: ఐటీటీఎఫ్ ‘అల్ వతాని) పారా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన ప్యాడ్లర్ హితేశ్ డొల్వాని మూ డు పతకాలతో సత్తాచాటాడు. క్లాస్ 10 కేటగిరీలో బరిలోకి దిగిన హితేశ్ పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ లో రజతాలు, పురుషుల సింగిల్స్ లో కాంస్యం చేజిక్కించుకున్నాడు.






