16 July, 2026 | 2:38 AM

ప్రొఫెషనల్ కెరీర్‌కు సౌరవ్ గుడ్‌బై

23-04-2024 01:04 AM

n దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానన్న స్కాష్ ప్లేయర్

 న్యూఢిల్లీ: భారత స్టార్ స్కాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ ప్రొఫెషనల్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ స్థాయిలో రెండు దశబ్దాలకు పైగా ఎన్నో విజయాలు సాధించిన 37 ఏళ్ల సౌరవ్ ఇకపై కేవలం దేశం తరఫున మాత్రమే ఆడుతూ.. ప్రొఫెషనల్ టోర్నీలకు దూరంగా ఉండనున్నట్లు సోమవారం వెల్లడించాడు. ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు, కామన్వెల్త్ క్రీడల్లో మూడు మెడల్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి ఇలా సౌరవ్ లెక్కకు మిక్కిలి పతకాలు సాధించాడు ‘22 ఏళ్ల క్రితం వరల్డ్ టూర్ జర్నీ ప్రారంభించా. ఇన్నేళ్లు ఆటలో కొనసాగుతానని అనుకోలేదు. ప్రతి దానికి ఒక విరామం ఉంటుంది. నాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ఆటను వదలాలంటే కష్టంగా ఉంది. నాలో ఇంక సత్తా ఉంది. మరికొన్నాళ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తా’ అని సౌరవ్ పేర్కొన్నాడు.