17 May, 2026 | 1:20 AM

ఘనంగా హెచ్‌కేఎంసీఎఫ్ 10వ వార్షికోత్సవం

17-05-2026 12:00 AM
  1. పాల్గొన్న ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖులు
  2. ఆధునిక వంటశాలను ప్రారంభించిన ముఖ్య అతిథి

నార్సింగి/హైదరాబాద్, మే 16(విజయక్రాంతి): హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ (హెచ్‌కేఎంసీఎఫ్) నార్సింగిలోని తన కేంద్రీకృత వంటశాల 10వ వార్షికోత్సవా న్ని, సమాజంలోని నిరుపేదలు, అవసరమైన వారికి 15 కోట్ల సమిష్టి భోజనాలను అందించిన విశిష్ట సేవా ప్రయాణాన్ని ఘనంగా జరు పుకుంది.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ప్రత్యేక అధికారి జయేశ్ రంజన్ ముఖ్యఅతిథిగా హాజరై, వంటశాల సేవా సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చే ఆధునిక పరికరాలను ప్రారంభించారు. ఈ వేడు కలు హరే కృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షులు,  అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు సత్య గౌర చంద్రదాస ప్రభుజీ సారథ్యంలో జరిగాయి.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా   డాక్టర్ ఎం. శివకుమారన్, డైరెక్టర్, ఆరోబిందో ఫార్మా లిమిటెడ్, గౌరవ అతిథులుగా బడావత్ సంతోష్, ఐఏఎస్, అదనపు కమిషనర్, జీహెచ్‌ఎంసీ ఎన్. రవి కిరణ్, అదనపు కమిషనర్, జీహెచ్‌ఎంసీ, కౌంతేయ దాస, సీఈవో, హెచ్‌కేఎం చారిటబుల్ ఫౌండేషన్ తదితర ప్రముఖులు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత ఫౌండేషన్ ముఖ్య ప్రతినిధు లు వంటశాల మొత్తం కార్యకలాపాలను అతిథులకు వివరించారు. 

ఆధునిక సాంకేతికతతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న వంట ప్రక్రియలను, సదుపాయాలను వారు పరిశీలించారు. ఈ సందర్భం గా జయేశ్ రంజన్ హెచ్‌కేఎంసీఎఫ్ అంతర్గత డిజైన్ బృందం రూపొందిం చిన ఆటోమేటెడ్ దోసె తయారీ యంత్రం, వెసెల్ సీలింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా లబ్ధిదారులకు ప్రతిరోజూ వేడి, పోషకాహార భోజనాల ను తీసుకెళ్లే ఆహార పంపిణీ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ మాట్లాడుతూ మా సేవా కార్యక్రమాలకు నిరంతర ప్రోత్సాహం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే నర్సింగి, మహబూబ్‌నగర్, శ్రీకాకుళం, కాకినాడ వంటశా లల స్థాపనకు విశేష సహకారం అందించిన ఆరోబిందో ఫార్మా , కె. నిత్యానంద రెడ్డికి మా ప్రత్యే క కృతజ్ఞతలు.

వారి సహకారం వల్ల లక్షలాది మంది లబ్ధిదారులకు చేరువ కావడం సాధ్యమైంది అని అన్నారు. ఆరోబిందో ఫార్మా లిమిటెడ్ వైస్‌చైర్మన్, మేనే జింగ్ డైరెక్టర్, అలాగే ఆరోబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ కె. నిత్యానంద రెడ్డి తన సందేశంలో, హెచ్‌కేఎం చారిటబుల్ ఫౌండేషన్‌తో దశాబ్దకాలంగా కొనసాగుతున్న భాగ స్వామ్యంపై గర్వంగా ఉందన్నారు.