17 May, 2026 | 1:19 AM

అన్ని జిల్లాల్లో వారోత్సవాలు నిర్వహించాలి

17-05-2026 12:00 AM

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లతో సీఎస్‌టెలీకాన్ఫరెన్స్

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి) : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 18నుంచి 23వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో యువజన, క్రీడా, పర్యాటక వారోత్సవాలు నిర్వహించాలని ప్రధానకార్యదర్శి రామ కృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ వేడుకలపై స్పెషల్ సెక్రటరీలు జయేష్‌రంజన్, వాణీప్రసాద్‌తో కలసి శనివారం సచివాలయం నుంచి కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సంద ర్భంగా సీఎస్ మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తి, దేహదారుఢ్యం, సామాజిక చైత న్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం వారోత్సవాల నిర్వహణకు నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో క్రీడాపోటీలు, ‘ఫిట్- తెలంగాణ’ థీమ్‌తో రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో 5కేరన్, మండల కేంద్రాల్లో వ్యాకథాన్, యోగా తదితర కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ప్రజల్లో చైతన్యంతేవాలన్నారు. వారోత్సవాల నేపథ్యంలో అన్ని మ్యూజియాల్లో ఉచిత ప్రవే శం కల్పించనున్నట్టు సీఎస్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై కూడా సీఎస్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.