హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేయాలి
10-12-2024 02:28 AM
* విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి పీఆర్టీయూ విజ్ఞప్తి
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వ, పంచాయతీ రాజ్ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల (హెచ్‌ఎం) పోస్టులను అడ్‌హక్ పద్ధతి లో పదోన్నతులతో భర్తీ చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి కోరారు. ఈమేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్‌ను సచివాలయంలో సోమవారం కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపా రు. పండిట్, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని కోరారు. రెండ్రో జుల్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యలు పరిష్కరించేలా నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి హామీ ఇచ్చినట్లు వారు సోమవారం ప్రకటనలో తెలిపారు.






