29-08-2025 01:13:20 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): న్యాయవ్యవస్థలో బీసీలకు జనాభా ప్రతిపాదికన అవకాశాలు కల్పించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి( Union Law Minister) కిరణ్ రిజుజ్ కి శుక్రవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతం బీసీ జనాభా ఉంటే న్యాయవ్యవస్థలో బీసీలు కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నారని, ఇది కాదా బీసీలపై వివక్ష అని ప్రశ్నించారు. 2018 నుంచి వివిధ హైకోర్టులలో 604 మందిని న్యాయమూర్తులుగా నియమిస్తే అందులో 458 మంది ఆగ్ర కులాల వారే ఉన్నారని, బీసీలు కేవలం 72 మంది మాత్రమేనని, బీసీల జనాభా ప్రతిపాదికన 300 మంది న్యాయమూర్తులుగా ఉండవలసిన స్థానంలో కేవలం రెండు శాతం మాత్రమే అంటే ఇది అన్యాయం కాదా అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక పక్క విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకయాలతో పాటు న్యాయవ్యవస్థలో మా జనాభా ప్రతిపాదికన అవకాశాలు కల్పించాలని ఉద్యమాలు నడుస్తున్నప్పటికి ప్రజాస్వామ్య బద్ధంగా మాకు రావలసిన వాట ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. న్యాయవ్యవస్థలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు వెంకన్న, శాఖపూరి భీమ్సేన్, వేముల అశోక్, చెలిమెల అంజయ్య, కీర్తి బిక్షపతి, అంకం సతీష్ తదితరులు పాల్గొన్నారు.