29-08-2025 01:14:53 PM
నూతన అధ్యక్షులుగా సత్ర పల్లి సారయ్య
ప్రధాన కార్యదర్శిగా అత్తే లక్ష్మీ నారాయణ
పినపాక, (విజయక్రాంతి): పినపాక మండల జర్నలిస్టుల సంఘం(Pinapaka Journalists Association) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పినపాక మండల జర్నలిస్టుల సంఘం కార్యాలయంలో గౌరవ సలహాదారులు యగమాటి గంగాధర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన సంఘం ఎన్నిక గురించి కమిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు కొత్త దామోదర్ గౌడ్,(నేటి గద్దర్), నూతన కమిటీ అధ్యక్షులుగా సత్రపల్లి సారయ్య,(ప్రజాజ్యోతి), ప్రధాన కార్యదర్శి అత్తే లక్ష్మీనారాయణ ,(విజయక్రాంతి), ఉపాధ్యక్షులుగా వాగబోయినయినా సాంబశివరావు, (న్యూస్ 10), కోశాధికారిగా కన్నె రమేష్,(పీపుల్స్ జడ్జిమెంట్ ), కమిటీ సభ్యులుగా గోడిశాల చంద్రం,(జనం సాక్షి), దొడ్డ శ్రీను, పడాల రాము, (టైమ్ టుడే) ఎన్నికయ్యారు.