16 July, 2026 | 10:16 AM

ఈ ఏడాది త్రిప్తిదే

06-12-2024 12:00 AM

‘యానిమల్’తో నటి త్రిప్తి డిమ్రీ రేంజ్ మారిపోయింది. ఇదే చిత్రం కథానాయిక రష్మిక మందన్నాను మించి ఈ ముద్దుగుమ్మకు నేమ్, ఫేమ్ వచ్చింది. దీంతో 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్‌లో టాప్ ప్లేస్‌లో త్రిప్తి నిలిచారు. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ సంస్థ ఏటా మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది జాబితాను తాజాగా విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 250 మిలియన్ పేజ్ వ్యూస్ ఆధారంగా ఈ జాబితాను ఐఎంబీడీ తయారు చేస్తుంది. దానిలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె, ఆలియా భట్‌లను దాటి మరీ త్రిప్తి తొలి స్థానాన్ని కైవసం చేసుకుది.

ఈ ఏడాదిలో త్రిప్తి.. ‘బ్యాడ్ న్యూస్’, ‘విక్కీ విద్యా కా వో వాలా వీడి యో’, ‘భూల్ భూలయ్యా 3’లతో తన రేంజ్‌ను పెంచుకున్నారు. ఈ మూడు చిత్రాల్లోని పాత్రలు త్రిప్తికి గుర్తింపు తెచ్చాయి. ఐడీఎంబీ ప్రకారం టాప్ 10లో త్రిప్తి, దీపికా పదుకొణె, ఇషాన్ ఖట్టర్, షారుఖ్ ఖాన్, శోభితా ధూళిపాళ్ల, శార్వరీ, ఐశ్వర్యరాయ్, సమం త, ఆలియా భట్, ప్రభాస్ ఉన్నారు.