23 August, 2026 | 7:46 PM

Breaking News

భక్తులపై తేనెటీగల దాడి

02-07-2026 12:00 AM

సుల్తానాబాద్, జూలై 1 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానంలో బుధవారం తేనెటీగలు భక్తులపై దాడి చేశాయి. దర్శనం అనంతరం చెట్ల కింద వంట చేసుకుంటుండగా ఒక్కసారిగా పొగ రావడంతో తేనెటీగలు లేచి దాడి చేశాయి. ఆరు నెలల పసిపాపతో సహా సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం. వారిని 108 అంబులెన్స్‌లో కాల్వ శ్రీరాంపూర్ ఆసుపత్రికి తరలించారు. కొంతమందిని కరీంనగర్‌కు తరలించారు.