2 July, 2026 | 1:16 AM

విజయవంతంగా ధాన్యం కొనుగోళ్లు

02-07-2026 12:00 AM

జిల్లాలో 4,28,361 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం  సేకరణ

రైతుల అకౌంట్లలో రూ.1004.13 కోట్ల జమ

1,01,752 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ

కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, జులై 1 (విజయక్రాంతి): రైతులు, అధికారుల సమన్వయంతో వరి ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్, అదనపు ఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్, వ్యవసాయ, సివిల్ సప్లై, గ్రామీణ అభివృద్ధి, పోలీసు శాఖలతో ధాన్యం కొనుగోలు విజయవంతంపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ..రైతులు, అధికారుల సమన్వయంతో విజయవంతంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామన్నారు.  హమాలీ, రవాణా ,రైస్ మిల్లులో ధాన్యం నిలువ చేయడానికి స్థలం లేకపోడడం, అకాల వర్షాలు, లోడింగ్, అ న్లోడింగ్ లాంటి సమస్యలను అధిగమించి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామన్నారు. ఈ ఏడాది యాసంగిలో గతంలో కంటే లక్ష మెట్రిక్ టన్నులు అత్యధికంగా రైతులు దిగుబడులు పండించారని,జిల్లాలో  4,28,361 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ పూర్తి అయిందన్నారు.

రైతుల అకౌంట్లలో రూ.1004.13 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. 1,01,752 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ చేసి అధికారులు జిల్లా యంత్రాంగం,గతంలో ఎన్నడూలేని విధంగా విస్తృతంగా రైతులకు సేవలు అందించారన్నారు. ఏప్రిల్ 10న ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లు జూన్ 29వ తేదికి పూర్తి చేశామన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లా వ్యా ప్తంగా ధాన్యం కొనుగోలు లో అదిక సమ స్యలని అధిగమించి పూర్తి  చేశామన్నారు.

అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ చొరవ, సమీక్షలు, క్షేత్ర పర్యటనలు, సమీక్షలతో 100 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్,జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ రావు, నర్సాపూర్, తూప్రాన్ ఆర్డీవోలు, రామ కృష్ణ, బావయ్య, జిల్లా సివిల్ సప్లై అధికారులు నిత్యానంద, CSO, జగదీష్ MCS, వ్యవసాయ అధికారి దేవకుమార్, రవాణా శాఖ అధికారి అశోక్ చక్రవర్తి, డి, ఎస్పీ లు, సిఐ లు, తహశీల్దార్లు, ఎస్ ఐ లు ,తదితరులు పాల్గొన్నారు.