13-10-2025 01:02:46 AM
కొత్తకోట, అక్టోబర్ 12: కొత్తకోట మండల పరిధిలోని ఉల్లంకొండ తాండకు చెందిన ఆశా కార్యకర్త మాధవి కుమారుడు విజయ నాయక్ గద్వాల పట్టణంలో మెడిసిన్ చదువుకోవడానికి ప్రభుత్వపరంగా సీటు రావడంతో ఆదివారం నాడు సిఐటియు ఆధ్వర్యంలో శాలువాతో సన్మానం చేయడం జరిగింది .
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ మాట్లాడుతూ విద్యార్థి విజయ్ నాయక్ ఎంబిబిఎస్ పూర్తి చేసుకొని ప్రజలకు సేవ చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు బి రాణి భాగ్యలక్ష్మిమిరాసి పల్లి మాజీ ఎంపిటిసి వెంకటరమణ గోపాల్ నాయక్ అలివేల తారమ్మ పద్మ చిన్నమ్మ జానకమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు