calender_icon.png 13 October, 2025 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా

13-10-2025 01:01:40 AM

తనిఖీల్లో పట్టుకున్న పోలీసులు  

అలంపూర్, అక్టోబర్ 12: ఏపీ నుంచి తెలంగాణకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు ఎస్త్స్ర శేఖర్ తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా జాతీయ రహదారిపై ఆదివారం బ్లూ కోట్ విధులు నిర్వర్తిస్తున్న అబ్దుల్ భాష ,రవి,లు ఇసుక లోడుతో వెళుతున్న లారీని తనిఖీ చేశారు.

డ్రైవర్ కేతావత్ బాలును విచారించగా ఇసుకను ఏపీ తాడిపత్రి నుంచి హైదరాబాదుకు తరలిస్తున్నట్లు చెప్పాడు. అనుమతి పత్రాలు లేకపోవడంతో లారీని స్టేషన్ కి తరలించి డ్రైవర్‌తో పాటు యజమాని ప్రభు లింగంపై కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర తెలిపారు.