calender_icon.png 13 October, 2025 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు అండగా ఉంటాం

13-10-2025 01:03:11 AM

టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు

ఖమ్మం, అక్టోబర్ 12(విజయక్రాంతి): మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న జేఏవో, ఏవోలకు గెజిటెడ్ హోదా కల్పించాలని ఏవో’స్ శివలింగ అధ్యక్షతన పలువురు టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు, టీజీఈజేఏసీ జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావుని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఉద్యోగులకు అండగా ఉంటామ ని, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం ఏలూరి శ్రీనివాసరావు ఖమ్మం పట్టణంలో జరుగుతున్న భగవాన్ శ్రీసత్యసాయి శతవార్షిక జన్మదిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్ర మానికి సత్యసాయి ట్రస్ట్ అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సంద ర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ  సత్య సాయి ట్రస్ట్ వారు కుల మతా వర్ణాలకు అతీతంగా చేస్తున్న కార్యక్రమాలు అద్వితీయమ న్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఎంతోమందికి   ఈ ఆశ్రమం ఒక దేవాలయంగా ఉందన్నారు.

ఉచిత వైద్య శిబిరాలు, పేదవారికి బి య్యం పంపిణీ లాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం శ్రీనివాసరావు పంచాయతీరాజ్ విభా గంలో పనిచేసిన ఎంపీఓ అరుణ్ గౌడ్ కు టుంబ సభ్యులను పరామర్శించారు.  కార్యక్రమంలో టీజీవో జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ మల్లెల రవీంద్ర ప్రసాద్ కోశాధికారి సూరంపల్లి రాంబాబు, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి కొనదన శ్రీనివాసరావు, టీజీవో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొండపల్లి శేషు ప్రసాద్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి విజయ్ కుమార్ వెటర్నరీ అసిస్టెం ట్ సివిల్ సర్జన్స్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మన్యం రమేష్ బాబు సోషల్ వెల్ఫేర్ వార్డెన్ అసోసియేషన్ రుక్మారావు అస్లాం మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, ఉపేందర్, చంద్రకళ, సందీప్, ఆశాకుమారి, తదితరులు పాల్గొన్నారు.