అటెండర్ గా పనిచేసిన చోటే ప్రజా ప్రతినిధిగా సన్మానం
ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipality) ఇందిరానగర్ కాలనీలో అప్పట్లోస్థానిక ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా పనిచేసిన మేసు పోషమ్మ ఇప్పుడు ప్రజా ప్రతినిధిగా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఐదవ వార్డ్ కౌన్సిలర్ గా గెలుపొంది అదే పాఠశాలలో ఉపాధ్యాయుల చేత సన్మానం పొందుకుంది. గురువారం ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో మేసు పోచమ్మను ఆ పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడి పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పోచమ్మ మాట్లాడుతూ గతంలో ఇదే పాఠశాలలో అటెండర్ గా పని చేసానని అదే చోట తనకు ఐదవ వార్డు కౌన్సిలర్ గా సన్మానం జరగడం సంతోషంగా ఉందని పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షరిఫా, ఉపాధ్యాయులు శోభ, అంగన్వాడి ఉపాధ్యాయురాలు పుష్ప, సిబ్బంది గంగవ్వ, భట్టి లక్ష్మి ,కొంపల్లి లక్ష్మి, నేత నర్సమ్మ ,నాయకులు మేష సతీష్, ద్యావతి దామోదర్, కొంపల్లి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు






