05-05-2025 03:18:45 PM
ఆస్పత్రి ఎదుట ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు ఆందోళన
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్, కార్మికులు, ఉద్యోగులు, పెండింగ్ వేతనాల కోసం సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన దిగారు. గత మూడు నెలలుగా వేతనాలు లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వేతనాల చెల్లింపు జాప్యానికి విసిగిపోయిన ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులు తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ ట్రెడ్ యూనియన్( Reg No. H -109/2022/) తెలంగాణ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు ధర్నాకు దిగారు.
రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఓం నారాయణ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు చెల్లించాలంటూ ప్లే కార్డులు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఆసుపత్రి ముఖద్వారం వద్ద ధర్నా చేశారు. ఫిబ్రవరి, మార్చి నుంచి ఏప్రిల్ 2025 మూడు నెలలుగా వేతనాలు విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ వేతనాలు చెల్లించాలని లేనియెడల నిరవధిక ఆందోళన వెనకాడమని రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ హోo నారాయణ హెచ్చరించారు. అనంతరం మెడికల్ సూపరింటెండెంట్ రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ కిరణ్, దుర్గ ప్రసాద్, మహేష్, షహీన్, నీరజ, ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు, పారిశుద్ద కార్మికులు రమేష్, అన్వార్ లక్ష్మన్, సాయి, సాయి కృష్ణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.