05-05-2025 02:04:22 PM
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Gadkari ) స్పష్టం చేశారు. 3900 వందల కోట్ల వ్యయంతో నిర్మించిన మంచిర్యాల నుండి వాంకిడి(మహారాష్ట్ర సరిహద్దు) ఎన్ హెచ్ 363 ఫోర్ లైన్ రోడ్డు,,నిర్మల్ - ఖానాపూర్ ఎన్ హెచ్ 61 రెండు వరుసల రోడ్డు,నాగపూర్ -హైదరాబాద్ ఎన్ హెచ్ 44 రహదారిలో అండర్ పాస్,జంక్షన్ లను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తో కలసి ప్రారంభించారు. అనంతరం కాగజ్ నగర్ క్రాస్ రోడ్ సమీపంలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జల సంరక్షణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
దీన్ దయాల్ స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు వివరించారు. గుడు,తిండి, గుడ్డ లేని పేదవారికి సేవలందించడమే రాజనీతి అని తెలిపారు. చీకటి ప్రాంతంలో వెలుగులు నింపేందుకు బిజెపి ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. రైతులు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. రైతుల అభివృద్ధికి ఎంపీ ,ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి సడక్ యోజన పథకం ద్వారా దేశంలో రహదారుల అభివృద్ధిని చేపడుతున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి ఇప్పటివరకు 5 వేల కిలోమీటర్ల కు పైగా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి పూర్తి సహకారం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు
గడ్చిరోలి జిల్లాకు అనేక సార్లు వెళ్లా ఆ జిల్లాకు ఆనుకోని ఉన్న ఈ ప్రాంతం గురించి నాకు అవగాహన ఉందని తెలిపారు. మన రైతు కేవలం అన్నదాత గా కాకుండా సాంకేతికతను అందిపుచ్చుకొని అన్ని రకాలుగా ఎదగాలని ఆకాంక్షించారు. నీళ్ళను నిల్వ చేయండి, ఇంటి నీళ్ళు ఇంటి వద్ద, పొలం నీళ్ళు పొలంలోనే గ్రామంలో ని నీళ్ళు గ్రామంలోనే స్టోరేజ్ చేసుకోవాలి సూచించారు. తెలంగాణ సీఎం కు చెప్తున్న ప్రాజెక్టులలో నీటిని స్టోరేజ్ చేసుకునే విధంగా ప్రణాళిక చేసుకోవాలి సూచించారు. తెలంగాణ లో రహదారులు అద్భుతంగా చేసిన ఘనత నరేంద్ర మోడీదని తెలిపారు. మరో మూడేళ్ల లో రెండు లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు జరిగిన అభివృద్ధి న్యూస్ రీల్ మాత్రమే, ఇంకా అస్సలు సినిమా ముందుందన్నారు. తెలంగాణ లో ఒక లక్ష కోట్లతో గ్రీన్ హైవే నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. శ్రీనగర్ జమ్మూ మధ్యలో 36 టన్నెల్ లు నిర్మిస్తున్నాము. కాశ్మీర్ నుండి కన్యాకుమారి రహదారి కల నెరవేరుతుంది. తెలంగాణ లో ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, విజయవాడ మీదుగా రహదారి వస్తుంది.
మేడారం రహదారి విస్తరణ కు పనులు చేస్తాము.నాగపూర్ నుండి హైదరాబాదు కు ఆరు వరసల జాతీయ రహదారి మంజూరు చేస్తామని తెలిపారు.నాకు ఏడు ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది, డ్రోన్ తో ఎరువులు స్ర్పే చేస్తా ను.తెలంగాణ కు పేదరికం నుండి విముక్తి రావాలి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు గూడెం నగేష్ గడ్డం వంశి ఎమ్మెల్సీ దండే విట్టల్,కలెక్టర్ వెంకటేష్, దో త్రె,అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ఏఎస్పీ చిత్తరంజన్ సంబంధిత అధికారులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.