27 July, 2026 | 6:45 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ఆర్మీ జవాన్లకు సన్మానం

04-06-2026 12:45 AM

గాంధారి, జూన్ 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం తండాలో గల శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయం లో నూతనంగా ఆర్మీ జవాన్లు గా ఎంపికైన 25 మంది యువకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తండా పెద్ద బిషన్ నాయక్ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల యువకులు భారత ఆర్మీకి ఎంపికవ్వడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన యువకులకు పలు సూచనలు చేశారు.

దేశరక్షణకై మండల యువత ముందుడడం మండలానికే గర్వకారణం అని ఆయన అన్నారు. మండల విద్యాధికారి శ్రీహరి మాట్లాడుతూ నేటి యువతకు ఈ 25 మంది ఆదర్శం అని, గ్రామీణ ప్రాంతాల యువకులు, విద్యార్థులు వీరిని మార్గదర్శకంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లభాన సంఘం అధ్యక్షుడు తాన్ సింగ్, మాజీ జడ్పీటీసీ శంకర్ నాయక్, ఉప సర్పంచ్ గోపాల్, బస్సీ నర్సింగ్, పెంటయ్య, పరశురామ్ మహారాజ్ పాల్గొన్నారు..