19-10-2025 05:48:45 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉత్తమ ర్యాంకులతో సీట్లు సాధించిన ఇద్దరు అమ్మాయిలకు దామెర సాహితీ క్షేత్రం నిర్మల్ నర్సింగ్ హోమ్ లో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో నర్సింగ్ హోమ్ సిబ్బంది, మిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. దామెర శోభారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో డాక్టర్ దామెర రాములు ప్రసంగిస్తూ ముందు ముందు మీరు ఇలాగే పీజీ సీట్లు కూడా సంపాదించి మన జిల్లాకు వన్నె తెచ్చి అశేష రోగులకు సేవలందించాలి అప్పుడే మీరు మీ తల్లిదండ్రుల రుణము జిల్లా రుణం తీర్చుకున్నట్లు అవుతుంది. పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలతో సన్మానం చేయడం జరిగింది, ఈ సందర్భంగా వైద్య విద్యార్థులకు కూడా స్పందించారు. మేము ఉత్తమ ప్రతిభ కనబరిచి చదువుకుంటామని హామీ ఇచ్చారు.