calender_icon.png 19 October, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కులు, ఆలోచనలు ఇప్పటికీ అమలు కాలేదు

19-10-2025 05:51:43 PM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యుగేందర్ గౌడ్..

ఘట్ కేసర్ (విజయక్రాంతి): అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కులు, ఆలోచనలు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యుగేందర్ గౌడ్ ఉన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 236వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం ఘట్ కేసర్ పట్టణంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బింగి యుగేందర్ గౌడ్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా ఇచ్చిన ఈ హక్కులు, ఆలోచనలు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అభివృద్ధి చెందకపోవడం అంబేడ్కర్ కలల భారతదేశం ఇంకా నెరవేరలేదని స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

అందుకే పోరాడితేనే మన హక్కులు మనకి వస్తాయని అంబేద్కర్ చెప్పారని పేర్కొన్నారు. అంబేద్కర్ రాసిన రచనలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా మారాయి. మహనీయుల జీవిత చరిత్రలను యువకులు అందరూ తెలుసుకొని వారి ఆశయ సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అందరిని భాగస్వామ్యులను చేస్తున్న ప్రబుద్ధ భారత్ ప్రతినిధులుని అభినందించారు. ఇలా ప్రజలని చైతన్య పరుస్తున్న మీసాల అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమం లో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాస్, నాయకులు ఎం. బాల్‌రాజ్, ఎండీ యూసుఫ్, తోక బాలయ్య, కె. సత్యం, కడప రవి, జి. అంజయ్య, బి. సురేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.