16 July, 2026 | 10:20 AM

కోహ్లీనే స్ఫూర్తి: అనన్య

18-04-2024 02:03 AM

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు స్ఫూర్తి అని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించిన దోనూరు అనన్య రెడ్డి పేర్కొంది. మైదానంలో విరాట్ ప్రదర్శించే పట్టుదల, కృషి అంటే తనకెంతో ఇష్టమని.. కోహ్లీ బాటలోనే ఎంచుకున్న రంగంలో మెరుగైన ప్రదర్శన చేయాలనే తపనే తనను ఇక్కడి వరకు తీసుకువచ్చిందని అనన్య వెల్లడించింది. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ సీఎస్‌ఈ2023 పరీక్షలో మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే.

తాజాగా అనన్య మాట్లాడుతూ.. ‘కోహ్లీ నా అభిమాన ఆటగాడు. గ్రౌండ్‌లో ఉన్నంతసేపు అలసట అన్నదే లేకుండా.. పోరాడటమే పనిగా సాగుతాడు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనూ కఠిన సవాళ్లు ఎదురవుతున్నా ఆశ వదులుకోడు. నేను అతడి నుంచి స్ఫూర్తి పొందా. అతడి క్రమశిక్షణ, కఠోర శ్రమ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది’ అని అనన్య చెప్పుకొచ్చింది.