calender_icon.png 18 October, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి

17-10-2025 11:52:44 AM

హైదరాబాద్: పంజాగుట్టలోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (National Institute of Medical Statistics)లో శుక్రవారం ఒక వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని అనస్థీషియా విభాగానికి చెందిన నితిన్ అనే విద్యార్థి గురువారం రాత్రి డ్యూటీకి హాజరైన తర్వాత ఆపరేషన్ థియేటర్‌లో అపస్మారక స్థితిలో కనిపించాడు. విగతజీవిగా పడిఉన్న వైద్య విద్యార్థి గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు(Panjagutta police) సమాచారం ఇచ్చారు. హూటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.